తనతో సైకిల్‌ తొక్కడానికి రమ్మంటున్న లోఫర్‌ బ్యూటీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

తనతో సైకిల్‌ తొక్కడానికి రమ్మంటున్న లోఫర్‌ బ్యూటీ


బాలీవుడ్‌ నయా సంచలనం.. దిశాపటానీ. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాప్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటో షూట్‌లతో, రెచ్చగొట్టే భంగిమలతో యువకుల మదిని కొల్లగొడుతోంది. తెలుగులోనూ మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సరసన ‘లోఫర్‌’ చిత్రంలో నటించింది.. ఈ భామ. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కే పరిమితమైంది. కాగా, అక్టోబర్‌ 7న న్యూఢిల్లీలోని జేఎల్‌ఎన్‌ స్టేడియంలో జరిగే సైకిల్‌ ర్యాలీకి హాజరవ్వాలని తన అభిమానులను ఆహ్వానించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఈవెంట్‌ వివరాలను వెల్లడించింది. పర్యావరణంపై అవగాహన కల్పించడానికి, శుభ్రమైన, పచ్చటి ఢిల్లీ కోసం ఈ సైకిల్‌ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఇందులో తనతోపాటు చాలామంది పాల్గొంటున్నారని, మీరు కూడా సైకిల్‌ తొక్కడానికి రావాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా 6.5 కి.మీ గ్రీన్‌ రైడ్, 10 కి.మీ ఓపెన్‌ రైడ్, 40 కి.మీ అమెచ్యూర్‌ రేస్‌ ఉంటాయని పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు ఠీఠీఠీ.ట్చజుటజ్చిఝp్ఛఛ్చీ ఛ్ఛీ జిజీ.ఛిౌఝలో నమోదు చేసుకోవాలని సూచించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad