వరు కత్తులు నూరుతోంది.. ఎందుకో.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

వరు కత్తులు నూరుతోంది.. ఎందుకో..


తమిళంలో ప్రముఖ హీరో శింబు సరసన పోడాపోడి చిత్రంతో అరంగేట్రం చేసింది.. వరలక్ష్మి శరత్‌కుమార్‌. ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్‌ మొదటి భార్య కుమార్తె అయిన వరలక్ష్మి గతంలో శింబు, ధనుష్‌లతో ప్రేమాయణాలు సాగించిందని కోలీవుడ్‌ కోడై కూసింది. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్‌తో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉందని త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నార ని గాసిప్పులు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను హీరో విశాల్‌ ఖండించాడు. వరు తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశాడు. తాజాగా వీరిద్దరూ కలసి పందెంకోడి–2 చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇందులో వరు లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎర్రటి చీర ధరించి రెండు పొడవాటి కత్తులు పట్టుకుని వాటిని నూరుతున్న వరు ఫొటోను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రస్టిక్‌ లుక్‌లో నుదుటి మీద జుట్టు పడుతుండగా కత్తిపై మరో పొడవాటి కత్తిని నూరుతూ కోపంగా చూస్తున్న వరు ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad