పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కుదరవు: సుప్రీంకోర్టు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కుదరవు: సుప్రీంకోర్టుప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయితే షరతులకు లోబడి ఈ తీర్పు ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలు అన్ని రకాలుగా రిజర్వేషన్లు పొందుతున్నారని, ఇప్పుడు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం సరికాదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2006లోనే సుప్రీంకోర్టు పదోన్నతుల్లో రిజర్వేషన్లు సరికాదంటూ తీర్పునివ్వగా దీనిపై మళ్లీ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు తాజాగా వ్యాఖ్యలు చేస్తూ పదోన్నతుల్లో రిజర్వేషన్లు సాధ్యం కాదని కుండబద్దలు కొట్టింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad