పాతబస్తీలో మరో ప్రణయ్! చావుబతుకుల్లో ప్రేమ బాధితుడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 20, 2018

పాతబస్తీలో మరో ప్రణయ్! చావుబతుకుల్లో ప్రేమ బాధితుడు!

srikanth-chittipaka-love-marriage

మొన్న మిర్యాలగూడలో తన కూతురు తమను ఎదురించి ఓ దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో అల్లుడినే హత్య చేయించాడు. నిన్న ఎర్రగడ్డలో ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో కన్న కూతురునే కడతేర్చాడు ఓ తండ్రి. ఇలా పరువు హత్యలు ఒక్కోటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. మళ్లీ పాత బస్తీకి చెందిన ఓ దళితుడు ప్రేమ వివాహం చేసుకున్న ఫలితానికి మృత్యువుతో పోరాడుతున్నాడు. పాతబస్తీకి చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమపెళ్లి నాలుగేళ్లు తిరగక ముందే అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. ఆమెపై ఉన్న ప్రేమతో భార్య దూరం కావడాన్ని శ్రీకాంత్‌ భరించలేకపోయాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉంది. అమ్మాయి తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉండటంతో శ్రీకాంత్‌ కుటుంబసభ్యులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడని, దళితుడు కావటంతోనే అతడు కక్ష్యగట్టాడని శ్రీకాంత్‌ బందువులు ఆరోపిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad