బాక్సర్ గా నటిస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

బాక్సర్ గా నటిస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో!


ఆర్ఎక్స్ 100తో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. వరంగల్ యువకుడు కార్తికేయ. అతితక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకువెళ్తున్నాడు. తాజాగా కార్తికేయ నటిస్తున్న చిత్రం 'హిప్పీ'. ప్రముఖ తమిళ నిర్మాత, తమిళంలో భారీ బడ్జెట్ మూవీలను తెరకెక్కించిన కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ బాక్సర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ రోజు సెప్టెంబర్ 21 కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా 'హిప్పీ' పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad