మహేష్ బాబుపై మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 14, 2018

మహేష్ బాబుపై మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

manoj prabhakar controversial comments on mahesh babu
టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుపై తమిళ కమెడియన్‌ మనోజ్‌ ప్రభాకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పైడర్‌ సినిమాలో మహేష్‌, ఎస్‌జే సూర్యల నటనను పోలుస్తూ ‘మహేష్ బాబు కు అసలు నటనే రాదు, ఆయనది రాక్‌ ఫేస్‌.. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు స్క్రీన్‌ మీద పెద్దరాళ్లను చూపిస్తూ మహేష్ బాబు ముఖాన్ని ఆ రాళ్లతో పోల్చి జోకులు పేల్చాడు. అంతటితో ఆగని మనోజ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా నటన రాదంటూ మహేష్ బాబు కత్రినాకు మేల్‌ వర్షన్ అంటూ సీరియస్ కామెంట్ చేశాడు.
ఇదిలాఉంటే ఈ కమేడియన్ పై మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే మహేశ్ బాబును విమర్శించారంటూ ఫైర్ అవుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad