సారిడాన్ టాబ్లెట్స్ పై కేంద్రం నిషేధం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 14, 2018

సారిడాన్ టాబ్లెట్స్ పై కేంద్రం నిషేధం!

saridon tablets banned
సారిడాన్ తోపాటు 328 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) డ్రగ్స్‌ను కేంద్రం నిషేధించింది. ఈ మందులు హానికరమని, వాటిని వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్) ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ మందులను తయారు చేయడం, విక్రయించడం వెంటనే ఆపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. 2016లో మార్చి 10న కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం 349 ఎఫ్‌డీసీలపై నిషేధం విధించింది. దీనిపై ఫార్మా కంపెనీలు పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో గత ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు ఈ ఔషధాల విషయాన్ని పరిశీలించాల్సిందిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్)ను కోరింది.  వాటిలో 328 ఎఫ్‌డీసీ ఔషధాలు హానికరమని కమిటీ నివేదిక ఇచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad