బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మణికర్ణిక (ద క్వీన్ ఆఫ్ ఝూన్సీ) చిత్రం టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా, టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే క్రిష్ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా కంగనా వ్యవహార శైలి నచ్చక వైదొలగినట్టు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సోనూ సూద్ కూడా సినిమా నుంచి అర్ధంతరంగా తప్పుకున్నారు. కొన్ని సన్నివేశాలను కంగనానే స్వయంగా రీషూట్ చేస్తోందని, అందుకే సోనూసూద్ సినిమా నుంచి తప్పుకున్నారని గాసిప్పులు వినిపించాయి. మరోవైపు క్రిష్ కూడా మణికర్ణిక నుంచి వైదొలగి నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'యన్టీఆర్' బయోపిక్ కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

No comments:
Post a Comment