Video Of Day

Breaking News

ఈ భామకు 46 ఏళ్ల అంటే నమ్ముతారా?

నిలువెత్తు తెలుగు అందం.. టబు 1994లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'విజయ్ ఫథ్'తో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. తెలుగులో అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవితో 'అందరివాడు', అక్కినేని నాగార్జునతో 'నిన్నే పెళ్లాడుతా', 'ఆవిడా మా ఆవిడే', 'సిసింద్రీ' విక్టరీ వెంకటేశ్ తో 'కూలీ నెంబర్ వన్', నందమూరి బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి', 'పాండురంగడు' వంటి సినిమాలు చేసింది. అబ్బాస్, వినీత్ లతో కలసి టబు నటించిన ప్రేమదేశం (తమిళంలో కాదల్ దేశం) చూసి కోట్లాదిమంది యువకులు టబుకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా తన అందాలను మెయిన్ టైన్ చేస్తోంది. 46 ఏళ్ల ఈ భామ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కుతున్న 'అంధకానూన్' చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఫొటోలకు పోజులిచ్చిన టబుని చూస్తే ఈమెకు 46 ఏళ్లు అని నమ్మడం చాలా చాలా కష్టం. 

No comments