ఎస్టీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

ఎస్టీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం


ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో జరిగిన ఓ కార్యక్రమలో పాల్గొన్న చౌహాన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదైతే విచారణ చేయకుండా అరెస్టు చేయబోమని అన్నారు. దీంతో ఆయనపై దళిత సంఘాలు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడ్డాయి. రెండు నెలల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికే ముఖ్యమంత్రి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తాయి. వాస్తవానికి సుప్రీంకోర్టు గతంలో ఒక కేసులో తీర్పు ఇస్తూ ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగమవుతోందని వ్యాఖ్యానించింది. దళితులపై దాడిచేశారని ఎవరిపైన అయినా కేసు నమోదు చేసేముందు వారిని విచారించాలని, అప్పుడు మాత్రమే కేసు నమోదు చేయాలని చెప్పడంతో దళిత సంఘాలు, ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్ ను నిర్వహించి హింసకు పాల్పడ్డాయి.
దళిత సంఘాలకు భయపడ్డ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ప్రకటించాల్సి వచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad