సినీ విమర్శకుడు, బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ కత్తి మహేశ్ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు. పవన్ కల్యాణ్ అభిమానులకు, కత్తి మహేశ్ కు తీవ్ర స్థాయిలో మీడియాలో వాగ్యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. కాటమ రాయుడు సినిమా రివ్యూ విషయంలో పవన్ అభిమానులు తనను టార్గెట్ చేశారని కత్తి మహేశ్ చెప్పినా.. ఎవరో ఒకరిద్దరు దుడుకు అభిమానులు చేసిన పనిని పవన్ కల్యాణ్ కు ఎలా అంటగడతారన్న ప్రశ్నకు కత్తి దగ్గర సమాధానం లేదు. ఇటీవల వరకు పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తానని సవాళ్లు విసిరిన కత్తి తాజాగా ఎంపీగా పోటీ చేస్తానంటూ ప్రకటించడం గమనార్హం. అయితే వివాదాస్పద అంశాల్లో వేలుపెట్టి తెలంగాణ నుంచి బహిష్కరణకు గురైన కత్తికి ఆంధ్రప్రదేశ్ లో హిందువులు ఎవరూ ఓటేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డిపాజిట్ దక్కడం కూడా కష్టమే.

No comments:
Post a Comment