పరిటాల కుటుంబం కన్ను ఆ సీటుపై! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

పరిటాల కుటుంబం కన్ను ఆ సీటుపై!

paritala sunitha son sree ram hindupur mp
వచ్చే ఎన్నికల్లో తన తనయుడిని కూడా ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తోంది మంత్రి పరిటాల సునీత. భర్త రవి హత్యానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సునీత ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్లు చేసేసింది. ఒక కొడుక్కూ, కూతురుకు సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేసింది. ఇక ఇప్పుడు  పెద్ద కొడుకును ఎమ్మెల్యేగా చేయాలని ఈమె అనుకుంటోంది.అందుకే రకరకాల ప్రయత్నాలుచేస్తూ ఉంది.

జిల్లాలోని ఇతర నియోజకవర్గాల మీద ఈమె కన్నేసింది. ధర్మవరం, పెనుకొండ, అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల మీద పరిటాల సునీత ముందుగా కన్నేసింది. వీటిల్లో తన తనయుడిని పోటీ చేయించడానికి ప్రయత్నించింది. అయితే.. ఆ ప్రయత్నాలకు చంద్రబాబు నుంచినే సానుకూలత వ్యక్తం కాలేదు. అందుకే.. ఈమె వేరే నియోజకవర్గాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. హిందూపురం ఎంపీగా తనయుడిని పోటీ చేయించే ప్రయత్నం చేసింది.

అయితే దానికీ చంద్రబాబు నాయుడు సానుకూలంగా లేడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు పరిటాల కుటుంబం కన్ను మరో నియోజకవర్గం మీద పడిందట. అదే కల్యాణ దుర్గం. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఉన్నాడు. ఆయన వచ్చేసారి పోటీకి వద్దని తమకు ఛాన్సు ఇవ్వాలని పరిటాల కుటుంబం డిమాండ్ చేస్తోందట. మరి చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఒప్పకుంటాడో లేదో ముందు ముందు తెలుస్తుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad