లైంగిక వేధింపులు.. హీరోయిన్ పై నటుడి కౌంటర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 27, 2018

లైంగిక వేధింపులు.. హీరోయిన్ పై నటుడి కౌంటర్!


bollywood_hero_nana_patekar_tanushree_dutta_Sexually_harassed_her
తనను బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని అంటూ నటి తనూశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ ఆరోపణలతో సంచలనం రేపింది. అయితే ఇది ఇప్పటి వ్యహారం కూడా కాదు. 2008లో నానా ఒక సినిమా షూటింగులో తనను వేధించాడని తనూశ్రీ ఆరోపించింది. డ్యాన్స్ భంగిమలు నేర్పిస్తానని అంటూ నానా తనను అసభ్యంగా తాకాడని తనూశ్రీ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ నేపథ్యంలో నానా స్పందించాడు. తనూశ్రీ దత్తావి అర్థం లేని ఆరోపణలు అని ఆయన వ్యాఖ్యానించాడు. ఆమెవి అసంబద్ధమైన ఆరోపణలు అన్నాడు. సినిమా షూటింగ్ అంటే.. కొన్ని వందల మంది సెట్స్ మీద ఉంటారని.. వారందరి మధ్యనా తను ఎలా ఆమెను లైంగికంగా వేధించగలను అని నానా ఎదురుప్రశ్నించాడు. ఆమెపై చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధం అని ప్రకటించాడు.

ఈ వ్యవహారాన్ని సంచలనంగా మారుస్తున్నారని మీడియా మీద కూడా నానా పటేకర్ విరుచుకుపడ్డాడు. ఈ వయసులో నానా మీద ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా సంచలనమే. ఇది వరకూ నానా పై ఏ హీరోయిన్ కూడా ఇలా మాట్లాడలేదు. ఒక్కసారిగా తనూశ్రీ దాడితో నానా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad