ప్రతీ విభాగంలోనూ పాక్ చెత్త ప్రదర్శన! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 24, 2018

ప్రతీ విభాగంలోనూ పాక్ చెత్త ప్రదర్శన!


ఆసియాకప్‌లో భారతజట్టుతో తలపడిన రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్‌ ఘోరంగా ఓటమి పాలవడం పట్ల పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే పాకిస్తాన్లో అభిమానుల, విమర్శకుల నుంచి ఆటగాళ్లు ఓటమి పట్ల ఎక్కువ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి లీగ్‌ మ్యాచ్‌లో ఇండియాతో పోటీకి దిగిన పాకిస్తాన్‌ ఓటమి పాలుకావడంపై వకార్‌ యూనిస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిన్న జరిగిన సూపర్‌-4 లోనూ పాకిస్తాన్ చెత్త ఆటతీరును కనబర్చినందుకు వసీం అక్రమ్‌ మండిపడ్డాడు. ప్రతీ విభాగంలోనూ పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శన చేసిందని, టాస్‌ గెలిచి బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్‌ తీసుకుందని విమర్శించాడు. గెలుపు-ఓటములు సహజమే అయినప్పటికీ ఇంత దారుణంగా ఓడిపోతారా అంటూ ప్రశ్నించారు. బోరింగ్‌ గేమ్‌తో దేశం మొత్తాన్ని నిరాశపరిచారని ఆయన విమర్శించాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad