ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 24, 2018

ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత!

pranay-statue-opposed

మిర్యాలగూడలో ఇటీవల ప్రేమ వివాహం చేసుకుని మామ చేతిలో హత్యకు గురైన ప్రణయ్ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రణయ్ భార్య అమృత వర్షిణి మరణించిన భర్తకు బాసటగా హంతకులకు కఠిన శిక్షణ పడేలా పోరాడుతానని కూడా పేర్కొంది. అంతేకాకుండా తండ్రి తన ముందుకు వస్తే చంపేస్తానంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో సైతం చెప్పడం విశేషం. రెండు పదుల వయసు నిండగానే ఇంత ఘోరమైన పరిస్థితి ఆమె పట్ల రాష్ట్ర ప్రజలు సానుభూతి ప్రకటించారు. కొందరు ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, మరికొందరు అమృతను అసెంబ్లీకి పంపాలని ఎవరి ప్రతిపాదనలు వారు ముందుకు తెచ్చారు. ఏదేమైనా ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై మిర్యాలగూడలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల సంఘం పేరుతో వీరు మిర్యాలగూడలోని మినీ రవీంద్ర భారతి వద్ద సమావేశం జరిపారు. ప్రణయ్‌ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది రెండు కుటుంబాల మధ్యలో జరిగిన సమస్య అని, దీన్ని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సరికాదని వారు వాదించారు. ప్రణయ్‌ విగ్రహాన్ని ఆయనకు చెందిన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చని, అంతే తప్ప పబ్లిక్ ప్రదేశంలో వద్దని వారు అన్నారు. దీనిపై డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad