కుటుంబ సభ్యుల సీట్ల కోసం కాంగ్రెస్ నేతల కసరత్తు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 24, 2018

కుటుంబ సభ్యుల సీట్ల కోసం కాంగ్రెస్ నేతల కసరత్తు!

Congress-leaders-family-seats

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ కుటుంబ పార్టీ అని విమర్శించే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులకు టికెట్లకోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు, వారి కుటుంబ సభ్యులు పార్టీలో, పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే.
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలు హుజూర్ నగర్, కోదాడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అలాగే కోమటిరెడ్డి సోదరుల్లో వెంకటరెడ్డి నల్లగొండ నుంచి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉండాలని భావిస్తున్నారు.  ఇదిలా ఉంటే పలువురు కీలక నేతలు వారితోపాటు తమ భార్యలు, కుమారులు, కూమార్తెలు, అల్లుళ్లను ఎన్నికల్లో బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జానారెడ్డి కూడా ఈ సారి తన కొడుకు రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ నుంచి పోటీకి దింపాలని చూస్తున్నారు.  మాజీ మంత్రి డీకే అరుణ.. గద్వాల నుంచి, కుమార్తె స్నిగ్ధారెడ్డిని మక్తల్‌ నుంచి పోటీకి యత్నిస్తున్నారు. మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్‌ కూడా తన కుమారుడు విక్రంగౌడ్‌ను ముషీరాబాద్ నుంచి పోటీకి దింపాలని చూస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తన కుమారుడు అనిల్‌కుమార్‌యాదవ్‌కు అసెంబ్లీ టికెట్‌ అడుగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్‌కు కంటోన్మెంట్‌ అసెంబ్లీ సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, తన భార్య జ్యోతికి వరంగల్‌ ఈస్ట్‌నుంచి టికెట్‌ అడుగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ తన కుమారుడు సాయిరాం నాయక్‌కు ఇల్లెందు లేదా మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad