తెలంగాణలో త్వరలో కానిస్టేబుల్ కొలువుల మేళా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

తెలంగాణలో త్వరలో కానిస్టేబుల్ కొలువుల మేళా!

3897 Constable posts in telangana
తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాల్లో ఏర్పడ్డ పోలీస్‌ యూనిట్లలో సివిల్, ఆర్మ్‌డ్‌ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  దీంతో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి 12 వేల పోస్టులకు పైగా భర్తీ చేసిన పోలీస్‌ శాఖ.. మరో 3,897 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో 907 సివిల్, 2,990 ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడ్డ 94 పోలీస్‌స్టేషన్లతోపాటు ఏఆర్‌ విభాగాలకు ఈ పోస్టులను కేటాయించనున్నారు. జిల్లాల వారీగా పోస్టుల విభజన, అందుకు తగ్గట్టుగా కేటగిరీల వారీగా నోటిఫికేషన్‌ రూపొందించడం తదితర వ్యవహారాలకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad