ఒకే శరీరం, రెండు తలలతో శిశువు జననం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

ఒకే శరీరం, రెండు తలలతో శిశువు జననం

two heads and one body child born in maharastaమహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబజోగాయ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి
 ఒకే శరీరం, రెండు తలలతో మగ శిశువు జన్మించింది. ఆస్పత్రి విభాగ్‌ డాక్టర్‌ సంజయ్‌ బన్‌సోడే నేతృత్వంలోని వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించి ప్రసూతి నిర్వహించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు. పర్లీ తాలుకాకు చెందిన ఓ గర్భిణి ప్రసూతి నిమిత్తం అంబజోగాయ్‌ ఆస్పత్రిలో చేరింది. గర్భం దరించినప్పటి నుంచి ఉన్న పాత ఫైల్‌ను పరిశీలించిన వైద్యులు రెండు తలలతో శిశువు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిశువు విచిత్రంగా రెండు తలలు, రెండు నోర్లు ఉండగా, ఒకే శరీరం, రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించాడు. ఆదివారం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కాన్పు చేశారు. శిశువు బరువు 3 కిలోల 700 గ్రాములు.

No comments:

Post a Comment

Post Bottom Ad