కేసీఆర్ మాటంటే మాటే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, August 02, 2014

కేసీఆర్ మాటంటే మాటే

kcr-Commitment-matey

తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినాయకుడిగా మొన్నటివరకు చూసిన కె. చంద్రశేఖర్ రావు వేరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పడు చూస్తున్న కెసిఆర్ వేరు. ఆ విషయం ఇప్పడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఆయన ఎంత మొండిమనిషో, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే బ్రహ్మరుద్రాదులు వచ్చినా దాన్ని మార్చలేరన్న విషయం సీమాంధ్ర నాయకులకు ఇప్పుడు తెలిసొస్తోంది. తెలంగాణలో చదువుకుంటున్న సీమాంధ్ర విద్యార్థుల ఫీజుల భారాన్ని 58 శాతం భరించడానికి తాము సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినప్పటికీ దాన్ని పరిశీలించడానికి కూడా కెసిఆర్ సిద్ధంగా లేరు. కెసిఆర్ వాదన ఒక్కటే. ఫీజు రియంబర్స్‌మెంట్ స్థానంలో తాము ప్రవేశపెట్టనున్న తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే పరిమితం. ఇతర విద్యార్థులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారైనందున వారి ట్యూషన్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం రియంబర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీమాంధ్ర విద్యార్థుల ఫీజులలో కొంత వాటాను తెలంగాణ ప్రభుత్వం భరించడానికి సిద్ధపడితే ఇతర రాష్ట్రాలు కూడా తమ విద్యార్థుల ఫీజులను భరించాలని అడుగుతాయని కెసిఆర్ చెబుతున్నారు. సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ చేయకపోవడం వల్ల మిగిలే ఆ డబ్బేదో తమ విద్యార్థులకే మరి కొంత ఉపయోగపడగలదన్నది ఆయన వాదన. మొత్తమ్మీద..చంద్రబాబు ఎంత దిగివచ్చినా కెసిఆర్ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగిరావడానికి సిద్ధంగా లేరన్నది దీంతో విస్పష్టమైంది

No comments:

Post a Comment

Post Bottom Ad