హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ స్వాగతం పలికిన చంద్రబాబు, కేసీఆర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, August 02, 2014

హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ స్వాగతం పలికిన చంద్రబాబు, కేసీఆర్

హైదరాబాద్
: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రణబ్‌కు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి వున్న సీఎం కేసీఆర్, చంద్రబాబు నాయుడు రాగానే ఆయనకు కరచాలనం చేశారు. అనంతరం ఆయనను తోడ్కొని వెళ్లి గవర్నర్‌కు ఇరుపక్కల కూర్చుని కొద్ది సేపు ముచ్చటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం చంద్రబాబు, కేసీఆర్ తొలిసారి భేటీ అయ్యారు.

No comments:

Post a Comment

Post Bottom Ad