19న ఇల్లు కదలొద్దు : సీఎం కేసీఆర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, August 02, 2014

19న ఇల్లు కదలొద్దు : సీఎం కేసీఆర్

on the 19 house cm kcr

సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఈ నెల 19న తమ సొంత గ్రామాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ రోజు అన్ని వివరాలను నమోదు చేసుకోకుంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకునే అవకాశం ఉండదని చెప్పారు. శుక్రవారం హెచ్‌ఐసీసీలో జరిగిన సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రజలంతా ఈ సర్వేను అత్యంత ప్రాధాన్యమైన విషయంగా పరిగణించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సర్వే విధుల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

సర్వే రోజును ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని, సర్వే బృందాలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా ఉద్యోగులకు సీఎం పలు వరాలు ప్రకటించారు. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు వాహన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణం మంజూరు చేయడంతో పాటు నెలవారీ అలవెన్సు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. తహసీల్దార్లు సొంత జిల్లాల్లో ఉద్యోగం చేయొద్దన్న నిబంధనను రద్దు చేయనున్నట్లు తెలిపారు.

సర్వే ఇలా...
- ఒక్కో ఉద్యోగి సర్వే చేయాల్సింది 25 నుంచి 30 కుటుంబాలు
- సర్వేకు వెళ్లే ఉద్యోగులు, అధికారుల ఎంపిక 7లోగా పూర్తి.. 15లోగా శిక్షణ పూర్తి
-సివిల్ దుస్త్తుల్లో పోలీస్ సిబ్బంది
- సర్వే సమాచారం 30 రోజుల్లో కంప్యూటరీకరణ
- అత్యధిక జనాభా, ఇండ్లు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై తర్జనభర్జన వీలైతే అక్కడా అదే రోజు.. లేదా వాయిదా!

No comments:

Post a Comment

Post Bottom Ad