పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 29, 2014

పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు

 Pawan gives shock fans

గబ్బర్‌సింగ్‌ 2 త్వరలోనే స్టార్ట్‌ అవుతుందని వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి పవన్‌ ఊహించని షాకిచ్చాడు‘గబ్బర్‌సింగ్‌ 2 ప్రాజెక్ట్‌ ఉంటుందా ఉండదా అనే డౌట్‌ చాలా కాలం నుండి అనుకుంటున్నారు.అయితే ఆ సస్పెన్స్‌కి తెర దించుతూ గబ్బర్‌సింగ్‌ 2 చిత్రానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. షూటింగ్‌ మాత్రం ఎన్నికల తర్వాత మొదలు పెట్టాలని అనుకున్నారు. పవన్‌ పాలిటిక్స్‌ నుంచి ఫ్రీ అవగానే గబ్బర్‌సింగ్‌ టైమ్‌ స్టార్ట్‌ అవుతుందని అనుకుంటే... ముందుగా గోపాల గోపాల చిత్రాన్ని మొదలు పెట్టాడు.
గబ్బర్‌సింగ్‌ 2 చిత్రాన్ని త్వరలోనే మొదలు పెడతాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఉండదనేది లేటెస్ట్‌ హాట్‌ న్యూస్‌. కారణాలు ఏమిటో కానీ ఈ చిత్రం చేయకూడదని పవన్‌ ఫిక్స్‌ అయ్యాడట. దీని స్థానంలో అదే నిర్మాతకి వేరే సినిమా చేసి పెడతాడట. ఇంకా దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు కానీ సంపత్‌ నందితో అయితే ఉండదని తేలింది.  రచ్చ తర్వాత రెండేళ్ల పాటు ఏ సినిమా చేయకుండా ఇది మొదలవుతుందని వేచి చూసిన దర్శకుడు సంపత్‌ నంది మరిప్పుడు ఏ హీరో దగ్గరకు వెళతాడో

No comments:

Post a Comment

Post Bottom Ad