కౌన్సెలింగ్ నోటిఫికేషన్ పై ఇరు రాష్ర్టాలకు ఇబ్బంది లేదు : ఉన్నత విద్యామండలి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 29, 2014

కౌన్సెలింగ్ నోటిఫికేషన్ పై ఇరు రాష్ర్టాలకు ఇబ్బంది లేదు : ఉన్నత విద్యామండలి

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి
సుప్రీంకోర్టు నిబంధనలకు అనుకూలంగానే కౌన్సెలింగ్ చేశామంటున్న :విద్యామండలి
కౌన్సెలింగ్ ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న కేసీఆర్ !

హైదరాబాద్ : బోదనా రుసుం విషయంపై సుప్రీంకోర్టులో ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఎంసెట్ నిర్వహణ వ్యవహారం నడుస్తుండగా ఉన్నతవిద్యామండలి హడావుడిగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ను ప్రకటించడమేంటని తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సిన సమయం మించి పోయింది. అదును తప్పితే ఇరు రాష్ర్టాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకే వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలు, ఉన్నత విద్యాధికారుల సూచలన మేరకే కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే హడావుడిగా తేదీలను ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు అన్నట్లు సమాచారం. తెలంగాణ రాస్ర్ట విద్యార్థులకు ఈ కౌన్సెలింగ్ వర్తించదంటూ... ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకోవాలని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు ఉన్నత విద్యామండలి మాత్రం కౌన్సెలింగ్  ప్రక్రియలో ముందు జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన వంటివి ముందు జరిగితే తప్పేంటని .. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేలోపు పరిశీలన అంశాన్ని పూర్తి చేస్తే మిగతా వెబ్ కౌన్సెలింగ్ తదుపరి చర్యలు సులభతరం అవుతుందని దీనివల్ల ఇరు రాష్ర్ట ప్రభుత్వాలకు ఎటువంటి నష్టం ఉండదని చైర్మన్ పేర్కొన్నారు. అంతేగాక విద్యార్థులకు కూడా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందనే ఉత్సాహాన్ని మదిలో నింపవచ్చనే అభిప్రాయంతోనే కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad