బాలికపై కాలేజీ విద్యార్థి అత్యాచారం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

బాలికపై కాలేజీ విద్యార్థి అత్యాచారం

రాజస్థాన్ లోని బికనీర్ జిల్లా శివబాది ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కాలేజీ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంజయ్ అనే విద్యార్థి 16 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి గురువారం రాత్రి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. పొరుగింటిలోనే ఉంటూ అతడీ ఘాతుకానికి తెగబడ్డాడు. మరుసటి రోజు ఉదయం బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad