జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 27, 2014

జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష!

 Jayalalithaa jailed for 4 years, fined Rs 100 crore

అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న మరో ముగ్గురు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగు జైలు శిక్ష, అదే విధంగా ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. డీఏంకే హయాంలో 1996 లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా ఈ 18ఏళ్ల కాలంలో మొత్తం 358 మంది సాక్షులని కోర్టు విచారించింది. ఇది కుట్రపూరిత దోరణితో వ్యవహరించినందుకు సెక్షన్ 120(బి), ప్రజాప్రతినిధిగా వుండి అవినీతికిపాల్పడినందుకు 13(1)(ఈ), 109 సెక్షన్ల కింద కోర్టు జయలలితని దోషిగా తేల్చింది. ఆ అక్రమాస్తుల కేసులో బెంగుళూరు ప్రత్యేక సెషన్స్ కోర్టు ఆమెకి నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యేక జడ్జి జాన్ మైఖెల్ కన్హ తీర్పుచెప్పారు.   జయలలితకు శిక్ష ఖరారైన నేపధ్యంలో తమిళనాడులో అ పార్టీ కార్యకార్తలు కొన్ని చోట్ల బస్సులు తగలబెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad