తెరపై రొమాన్స్ ను పండించేసినట్టుగా కనిపిస్తున్నా సదరు సీన్లను చిత్రీకరించే ముందు హీరోలను బాగానే ముప్పు తిప్పలు పెడుతుందట సంగీత. ఈ చబ్బీ హీరోయిన్ తన తీరు గురించి తనే చెప్పుకుంది. కొన్ని సినిమాల్లో రొమాంటిక్ సీన్లను చిత్రీకరించే సందర్భంలో వాటిల్లో నటించిన హీరోలను 'అన్నయ్యా.'అంటూ పిలుస్తూ తను వారిని ఇబ్బంది పెట్టినట్టుగా చెప్పింది సంగీత.
ఒక టీవీ చానల్ టాక్ షోలో ఆమె మాట్లాడుతూ.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. 'సంక్రాంతి' సినిమా షూటింగ్ లో కూడా అలానే జరిగిందని సంగీత వివరించింది. ఆ సినిమాలో శ్రీకాంత్ కు సంగీత పెయిర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సందర్భంగా వీరిద్దరి మధ్యన ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తూ ఉండగా.. హీరో శ్రీకాంత్ ను పదే పదే 'అన్నయ్య' అంటూ పిలిచినట్టుగా సంగీత చెప్పింది. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత మరోసారి అలా అనేసరికి ఆయన బాగా ఇబ్బంది పడ్డారని, ఆ సీన్ చిత్రీకరణ ముందు అలా పిలవడంపై డైరెక్టర్ కు కూడా కంప్లైంట్ చేసినట్టుగా సంగీత వివరించింది.
శ్రీకాంత్ ను మాత్రమే కాదని.. తనతో నటించిన హీరోలందరినీ తను సీన్ ముగిసిన తర్వాత 'అన్నయ్య' అనే పిలుస్తానంటూ సంగీత వివరించింది. అందరూ తనకు అన్నయ్య లేని పేర్కొంది ఈ మాజీ హీరోయిన్.
కృష్ణవంశీ సినిమా 'చందమామ'లో కూడా తనకే అవకాశం వచ్చిందని, అయితే ఆ పాత్రకు తను సెట్ కానని అప్పుడే తేలిపోయిందని సంగీత చెప్పింది.
'ఖడ్గం' సినిమాకు ముందే 'చందమామ' సినిమా 'మల్లెపువ్వు' పేరుతో తెరకెక్కాల్సిందని అయితే అప్పుడు ఆగిపోయిందని, 'ఖడ్గం' లో కృష్ణ వంశీ తనకు పిలిచి అవకాశం ఇచ్చారని సంగీత వివరించింది. తమిళ హీరో విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టు తరహా పాత్రలు చేయడనికి తను రెడీ అని ఈ మాజీ హీరోయిన్ ప్రకటించింది.
No comments:
Post a Comment