మంత్రి పదవి దక్కలేదని బాగా అసంతృప్తితో ఉన్న ఆర్కే రోజాకు అంతకన్నా ప్రాధాన్యత ఉన్న పదవే దక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ కేబినెట్లో ఆమెకు అవకాశం దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా నిలుస్తూ వచ్చింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా గట్టిగా చర్చ జరిగింది. కుల సమీకరణాల నేపథ్యంలో జగన్ తనకు అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చని బయటకు చెప్పిన రోజా ఈ విషయంలో ముఖ్యమంత్రి వద్ద గట్టిగా పట్టు బట్టినట్టుగా తెలుస్తోంది.
తనకు అవకాశం ఇవ్వాలంటూ జగన్ దగ్గర దబాయించుకోగల చనువు రోజాకు ఉండవచ్చు. ఈ క్రమంలో ఆమెకు జగన్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారట. అందులో మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఒకటి ఉందట. దాంతో పాటు ఆర్టీసీ చైర్మన్ పదవిని కూడా ఆఫర్ చేశారట జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆమె మాత్రం అవి వద్దని, తను ఏ పదవీ లేకుండానే పార్టీలో కొనసాగబోతున్నట్టుగా రోజా చెప్పిందట.
అయితే ఆ సందర్భం ఏపీఐఐసీ చైర్మన్ పదవి ప్రస్తావన కు వచ్చిందని, ఆ పదవి కావాలని రోజా పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలు, సెజ్ ల ఏర్పాటు విషయంలో ఆ కమిషన్ కు మంచి పవర్స్ ఉంటాయి. దాని చైర్మన్ పదవి చాలామంది నేతలను ఊరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రోజా ఆ పదవి కావాలని పట్టుబట్టారని.. ఆ విషయంలో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.దాదాపుగా రోజాకు ఆ పదవి ఖరారు అయినట్టే. ఈ విషయాన్ని అధికారికంగా ఫేస్ బుక్ లో ప్రకటించేసుకుంది రోజా. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారామె.
ఇలా ఆమెకు మంచి ప్రాధాన్యత లభించినట్టే. అయితే ఏపీఐఐసీ చైర్మన్ పదవి విషయంలో మరి కొందరు కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. వారిలో అంబటి రాంబాబు కూడా ఒకరు. ఆయన గతంలో ఆ హోదాలో ఉండే వారు. ఇప్పుడు మంత్రి వర్గంలో ఆయనకు కూడా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయనను జగన్ ఎక్కడ అకామడేట్ చేస్తారనేది మరో ఆసక్తిదాయకమైన అంశం.
No comments:
Post a Comment