గేమ్ ఓవర్ కలెక్షన్స్: దటీజ్ తాప్సీ స్టామినా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, June 18, 2019

గేమ్ ఓవర్ కలెక్షన్స్: దటీజ్ తాప్సీ స్టామినా!


ఆ సినిమాలో మేల్ లీడ్ అంటూ ఎవరూ లేరు. సినిమాలో మొహం చూపే మగ పాత్ర  కూడా రెండు మూడు ఉంటాయంతే. మేల్ లీడ్ లేకుండా ఈ రోజుల్లో సినిమాలు రావడం అంటే అదే విచిత్రం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తూనే ఉన్నా.. వాటిల్లో మేల్ లీడ్ కూడా ఉంటూ వస్తున్నారు.

ఇలాంటి క్రమంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించగా వచ్చిన 'గేమ్ ఓవర్' హీరో ప్రస్తావనే లేకుండా సాగింది. ఈ సినిమా ప్రధాన  ఆకర్షణ తాప్సీనే. ఇదో థ్రిల్లర్ అనే ప్రచారానికి తోడు తాప్సీ మాత్రమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దానికి తోడు ఈ సినిమాకు  పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

మూడు భాషల్లో విడుదల అయ్యింది ఈ సినిమా. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల అయ్యింది. అన్ని భాషల్లోనూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
ఫలితంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే దక్కాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లో నాలుగున్నర కోట్ల రూపాయల వసూళ్లు దక్కినట్టుగా తెలుస్తోంది. మూడు భాషల్లో కలిపి ఆ వసూళ్లు వచ్చాయట.

ఈ సినిమాను స్వల్పమైన  బడ్జెట్ తోనే రూపొందించినట్టుగా ఉన్నారు. దీంతో ఈ వసూళ్లు ఈ సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకొచ్చినట్టే. ఈ సినిమాకు డిజిటల్ మీడియాలోనూ, టీవీ మీడియాలోనూ మంచి డిమాండే ఉంది. ఈ సినిమా  ప్రసార హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ఈ సినిమాకు మంచి ఛాన్స్ ఉంది. స్థూలంగా ఈ సినిమాకు మంచి లాభాలే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad