మామిడి కాయ తింటే గర్భవతి అన్నారని వాపోతున్న హాట్ భామ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 25, 2019

మామిడి కాయ తింటే గర్భవతి అన్నారని వాపోతున్న హాట్ భామ

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో 'రత్తాలు.. రత్తాలు.. ఓసోసి రత్తాలు', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో 'తోబ.. తోబ.. తోబ..' అంటూ ప్రత్యేక గీతాల్లో హోయలొలికించింది.. హీరోయిన్ లక్ష్మీరాయ్. తెలుగులో అప్పుడెప్పుడో శ్రీకాంత్ సరసన 'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంతోనే అరంగేట్రం చేసినా ఆ సినిమా ఆడకపోవడంతో ఈ భామకు ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు.

అయితే తమిళనాట తనదైన స్కిన్ షోతో ఈ భామ తన సత్తా చాటింది. తాజాగా ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పాఠకులతో పంచుకుంది.. ఈ ముద్దుగుమ్మ. ఒకసారి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఎవరో మామిడికాయ తినమని ఇస్తే తిన్నానని.. దాన్ని ఎవరో ఫొటో తీసి లక్ష్మీరాయ్ గర్భవతి అని, అందుకే మామిడికాయ తింటుందని అసత్య ప్రచారం చేశారంటూ వాపోయింది.

మామిడికాయకే పరిమితమవకుండా అనేకమందితో తనకు సంబంధాలు అంటగట్టారని, చివరకు కుటుంబ సభ్యులతోనూ అక్రమ సంబంధాలు అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని వదలకుండా కోర్టుల్లో కేసులు కూడా వేశానని, అయితే వాటివల్ల సమయం వృథా అవుతుండటంతో వాళ్ల ఖర్మకు వాళ్లను వదిలేశానని చెప్పుకొచ్చింది. అనవసర విషయాలను పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటున్నానని, ఇప్పుడు అలాంటివాటి గురించి ఆలోచించే సమయం కూడా లేదంటూ సెలవిచ్చింది. కొంతమంది వ్యక్తులతో ప్రేమలో కూడా పడ్డానని, అయితే ఆ ప్రేమలు విఫలమయ్యాయని బాంబుపేల్చింది. ప్రస్తుతం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' మూవీలో లక్ష్మీరాయ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad