ఢిల్లీ తరపున ధావన్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 01, 2018

ఢిల్లీ తరపున ధావన్‌

Shikhar-Dhawan-Will-Play-Delhi-Dare-Devils-From-2019

2019 ఐపీఎల్‌లో శిఖర్‌ ధావన్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ఆడటం దాదాపు ఖాయమైంది. ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌కు ఆడుతున్న ధావన్‌ ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్నాడు. సన్‌ రైజర్స్‌ యాజమాన్యం తనకు చెల్లిస్తున్న ధరపై ధావన్‌ అసంతృప్తితో ఉన్నాడని వార్తలు రావడంతో అతడిని విడుదల చేసింది. ధావన్‌ తొలి ఐపీఎల్‌ (2008)లో ఢిల్లీ, అనంతరం రెండేళ్లు ముంబై ఇండియన్స్‌ తరపున ఆడాడు. 2011, 12లలో దక్కన్‌ చార్జర్స్, 2013 నుంచి సన్‌రైజర్స్‌ జట్టులో భాగంగా ఉన్నాడు. సన్‌రైజర్స్‌ తరఫున 91 ఇన్నింగ్స్‌లు ఆడి 125.13 స్ట్రైక్‌ రేట్‌తో 2,768 పరుగులు చేసిన ధావన్‌ 2016లో ట్రోఫీ నెగ్గడంలో కీలకంగా నిలిచాడు.   

No comments:

Post a Comment

Post Bottom Ad