సిలబస్ నుంచి కంచ ఐలయ్య పుస్తకాలు తొలగింపు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

సిలబస్ నుంచి కంచ ఐలయ్య పుస్తకాలు తొలగింపు


ఢిల్లీ యూనివర్సిటీ ఎంఏ - పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి ప్రముఖ రచయిత, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను తొలగించనుంది. ఆయన రాసిన వై అయాం నాట్ ఎ హిందూ, గాడ్ యాజ్ పొలిటకల్ ఫిలాసఫర్:బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మనిజం, పోస్ట్ హిందూ ఐడియా: ఎ డిస్కోర్స్ ఇన్ దళిత్-బహుజన్ సోషియో-స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రెవల్యూషన్ పుస్తకాలు 2010-12 నుంచి సిలబస్లో ఉన్నాయి. వీటినే ఇప్పుడు సిలబస్ నుంచి తొలగించాలని యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆ పుస్తకాలు హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది. దీనిపై యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ నవంబర్ 15లోగా తుది నిర్ణయం తీసుకోనుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad