అందరూ ఊహించినట్లుగానే బిగ్‌ బాస్ విజేత కౌశలే ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

అందరూ ఊహించినట్లుగానే బిగ్‌ బాస్ విజేత కౌశలే !


అందరూ ఊహించినట్లుగానే బిగ్‌ బాస్ సీజన్‌‌-2 టైటిల్ విన్నర్గా కౌశల్ విజయం సాధించాడు. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, బయటా ప్రచారం జరిగినట్లుగానే కౌశల్ విజయం సాధించడం విశేషం. స్టార్ మా టీవీలో గత మూడున్నర నెలలుగా కొనసాగిన ఈ రియాలిటీ షో ఆదివారం సాయంత్రం 6గంటలకు ఫైనల్ ఎపిసోడ్ ప్రారంభమైంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్‌ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్‌.. హౌస్‌మేట్స్‌ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ షోను తెగ ఎంజాయ్‌ చేశారు. అయితే చివరి అంకానికి చేరుకున్న తరుణంలో బిగ్ బాస్ సీజన్ -2 విన్నర్ ఎవరు అనే ప్రశ్న అందరినీ తొలిచివేసింది. హౌస్‌లో తనదైన స్టైల్‌లో విభిన్నంగా గేమ్‌ ఆడిన కౌశలే బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌గా నిలిచాడు.  వంద రోజుల‌కి పైగా సాగిన ఈ ప్రయాణంలో ఫైన‌ల్కు చేరిన కౌశ‌ల్‌, గీతా మాధురి, త‌నీష్‌, దీప్తి నల్లమోతు, సామ్రాట్‌ రెడ్డిల్లో సీజన్ -2 విజేతగా కౌశల్ నిలిచాడు. విక్టరీ వెంకటేశ్ ఈ షోలో పాల్గొని విజేతకు టైటిల్ ను అందించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad