నల్గొండ జిల్లాలో మరో ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ పరిస్థితి విషమం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

నల్గొండ జిల్లాలో మరో ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ పరిస్థితి విషమం


నల్గొండ జిల్లాను రోడ్డు ప్రమాదాలు వీడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె కారు కుక్కను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ ను ఢీకొ్ట్టింది. పల్టీలు కొడుతూ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి హుటాహుటిన అత్యవసర చికిత్సకోసం అరుణను కోదాడ ఆస్పత్రికి తరలించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad