కాంగ్రెస్ కమిటీల్లో బ్రోకర్లకు స్థానం! కోమటిరెడ్డి బ్రదర్స్‌ అవసరమా.. లేదా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

కాంగ్రెస్ కమిటీల్లో బ్రోకర్లకు స్థానం! కోమటిరెడ్డి బ్రదర్స్‌ అవసరమా.. లేదా?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణలోనూ అధికారం సాధించలేకపోగా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూల కారణమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2014లో ఓటమిపాలైంది. అయితే తాజాగా ఆ పార్టీ తెలంగాణ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 2014లో కాంగ్రెస్లో గ్రూపు తగాదాల మూలంగానే కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలకోసం తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన కమిటీలపై ఆయన తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియాకు ఫోన్‌ చేసి రాష్ట్రానికి శనిలా దాపురించావని, కార్యకర్తల కోసం కష్టపడుతున్న నాయకులను కాదని బ్రోకర్‌ కొడుకులను ఎక్కడి నుంచి తెచ్చావని నిలదీశానని చెప్పారు. కుంతియా అంటే భయం లేదన్నారు. వంద మంది కుంతియాలు వచ్చినా తననేం చేయలేరని, నా బీఫారం ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో టీవీల ముందు కూర్చుని మాట్లాడేవారికి, నమస్తే పెడితే ప్రతి నమస్కారం చేయనివారికి టికెట్లు ఇస్తే పార్టీ గెలుస్తుందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ అవసరమా.. లేదా.. అని నిలదీశానని చెప్పారు. ఏదేమైనా కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ గెలవాలని కార్యకర్తలకు హితబోధ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad