ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌తో బంగ్లా ‘ఢీ’ నేడే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌తో బంగ్లా ‘ఢీ’ నేడే!


సూపర్‌–4 చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 37 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టిన బంగ్లాదేశ్‌ నేడు(శుక్రవారం) భారత్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో పాక్‌ లెఫ్టార్మ్‌ పేసర్లు జునైద్, షాహిన్‌ ఆఫ్రిది (2/47) ఆరంభంలో బంగ్లాను బెంబేలెత్తించినప్పటికీ బంగ్లా మంచి ఆటతీరును ప్రదర్శించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 48.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (116 బంతుల్లో 99; 9 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, మొహమ్మద్‌ మిథున్‌ (84 బంతుల్లో 60; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. పాక్‌ బౌలర్లలో జునైద్‌ ఖాన్‌ కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (105 బంతుల్లో 83; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తఫిజుర్‌ రహమాన్‌ (4/43) పాక్‌ను దెబ్బ తీశాడు. గెలుపు ఉత్సాహంతో ఉన్న బంగ్లాదేశ్ నేడు ఇండియాతో తలపడనుంది. 2016లోనూ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, బంగ్లా ఆడిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad