అబ్బే.. తెలంగాణ సీఎం సీటొద్దు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

అబ్బే.. తెలంగాణ సీఎం సీటొద్దు!

తనకు తెలంగాణ సీఎం పీఠంపై ఆశలు లేవని పరోక్షంగా ప్రకటించాడు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జైపాల్ రెడ్డి స్పందించారు. తను తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనని ఈ సీనియర్ కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. తను వచ్చేసారి కూడా ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ సీఎం కావాలనే ఆసక్తి తనకు లేదని తేల్చేశారు.

తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను.. తెలంగాణ సీఎం రేసులో ఉన్నానని ఎవరైనా ప్రచారం చేస్తే అది తప్పుడు ప్రచారమని జైపాల్ తేల్చేశారు. మొత్తానికి జైపాల్ వివరణ అయితే బాగానే ఉంది కానీ.. కాంగ్రెస్ పార్టీలో ఎవరి మదిలో ఏముందో, ఎవరు ఏ ప్లాన్ తో ఉన్నారో చెప్పడం చాలా చాలా కష్టం. నిజంగానే జైపాల్ తెలంగాణ సీఎం కావాలని అనుకుంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా అధిష్టానం అండ ఉంటే ఏ ఎమ్మెల్సీగానో నామినేషన్ తీసుకుని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడానికి అవకాశం ఉండనే ఉంటుంది. అయితే తను రేసులో లేనని జైపాల్ స్పష్టం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad