గూగుల్ తేజ్ ఇక నుంచి గూగుల్ పే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, August 28, 2018

గూగుల్ తేజ్ ఇక నుంచి గూగుల్ పే!


టెక్‌ దిగ్గజం గూగూల్‌..  గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన గూగుల్‌ తేజ్‌ యాప్‌ను ‘గూగుల్‌ పే’గా మార్చింది. వారం వారం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో తక్కువ కాలంలోనే ఎక్కువ కస్టమర్లను గూగుల్ సంపాదించింది. తాజాగా ఈ పేమెంట్స్‌ యాప్‌ పేరును గూగుల్ పేగా మారుస్తూ యాప్‌కి కొత్త ఫీచర్లను కలిపింది. బ్యాంక్‌ ఒప్పందాలతో యాప్‌ సేవలను కూడా విస్తరించింది. గూగుల్‌ పే కస్టరమ్లకు ప్రి-అప్రూవ్‌డ్‌ రుణాలను తక్షణం అందించేందుకు పలు ప్రైవేట్‌ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్‌ పే యాప్‌ ఉపయోగిస్తున్నవారు త్వరలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad