లోకేశ్ బాబు మళ్లీ తప్పులో కాలేశారు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 10, 2018

లోకేశ్ బాబు మళ్లీ తప్పులో కాలేశారు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్ బాబు తరచూ మాటలు తడబడుతుంటారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కామన్ అయిపోయింది. ఇదివరకు వర్ధంతి, జయంతి పదాలను సందర్భరహితంగా వినియోగించడం, బంధుప్రీతి, అవినీతి పార్టీ రాష్ట్రం టీడీపీ మాత్రమే అని నాలిక్కరుచుకోవడం, అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉందంటూ, సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తే మనల్ని మనమే ఉరి వేసుకున్నట్లు అనడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
అయితే తాజాగా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన బ్రాహ్మణకొట్కూరులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఫుల్‌ మెజార్టీ ఉన్నా అన్నగారిని దింపితే తెలుగు ప్రజలు గర్జించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొనడం విశేషం.

No comments:

Post a Comment

Post Bottom Ad