ఎల్.జి. కి ఢిల్లీలో సర్వీస్ సెంటర్ లేదా? సోషల్ మీడియాలో వైరల్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, June 16, 2018

ఎల్.జి. కి ఢిల్లీలో సర్వీస్ సెంటర్ లేదా? సోషల్ మీడియాలో వైరల్!

 "LG In Delhi Not Working," Tweets Shirish Kunder. LG Electronics Responds

ఐదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సినీ దర్శకుడు తనదైన శైలిలో స్పందించారు. తన ట్టిట్టర్లో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీరియస్ సమస్యలపై కూడా కామెడీగా కామెంట్ చేసే ఆయన తాజాగా ఢిల్లీలో ఎల్.జి.కి సర్వీస్ సెంటర్ లేదా? ఢిల్లీలో అది పనిచేయడం లేదా? అంటూ ట్వీట్ చేయడమే దీనికి కారణం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఎల్.జి. అంటే ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థతోపాటు  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనే అర్థం వస్తుండడం ఈ హాస్యం మరింత పండింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్‌, మంత్రులు ఈ నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. వీరు తన కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో గవర్నర్‌ ఇంటి నుంచే ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందిన ఫైల్స్‌ను మాత్రమే చూస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఒక్క ఫైల్‌ను ముట్టడం లేదు. అంతేకాక ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రుల్ని, ఢిల్లీ ముఖ్యమంత్రిని అసలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కుందర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే తమ కంపెనీపై కామెంట్ చేశారని భావించిన ఎల్.జి. కంపెనీ ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ కాంటాక్ట్‌ వివరాలు మాకు అందించండి. దీంతో వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాం’ అని రీట్వీట్ చేసింది. అయితే శిరీష్ కుందర్, ఎల్.జి. చేసిన ట్వీట్లను వారు తర్వాత డిలీట్ చేశారనుకోండి!

No comments:

Post a Comment

Post Bottom Ad