ప్రేమకథా చిత్రమ్-2లో ఇద్దరు భామలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 24, 2018

ప్రేమకథా చిత్రమ్-2లో ఇద్దరు భామలు!

prema-katha-chitram-two-heroines

సుధీర్‌ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమకథా చిత్రమ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కామెడీ హర్రర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్‌ హీరోగా సీక్వెల్‌ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రమ్ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
హరి కిషన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్‌గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్‌ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్‌ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad