అయితే చంద్రబాబును జైలుకు పంపాలా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

అయితే చంద్రబాబును జైలుకు పంపాలా?

somu-verraju-comments-on-babu
గతంలో ప్రత్యేక హోదా గురించి అడిగితే విద్యార్థులను జైలుకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆ విషయం లేవనెత్తుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరిని జైలుకు పంపాలో చంద్రబాబునే అడగాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై ప్రత్యేక హోదా విషయంలో నిలదీస్తున్న సమయంలో చంద్రబాబు ఈ మాటలు అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆయా సమయాలలో చేసిన వివిధ ప్రకటనలను ఆయన మీడియాకు చూపించి వీటి గురించి చంద్రబాబును అడగాలని మరీ, మరీ కోరారు. 'ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు అన్నారు. హోదాతో ఒరిగేదేం లేదు. హోదా రాకపోతే నష్టం 3వేల కోట్లేనని తెలుగుదేశం పెద్దలకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది మేం నమ్మాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా విశ్వసించింది. కానీ, ఇప్పుడు జైలుకు ఎవరు వెళ్లాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ధర్మయుద్ధం జరుగుతుంది. మీ కాల్లకు మొక్కుతున్నాను. . ఈ విషయాలపై మీడియా మిత్రులు సీఎం చంద్రబాబును ప్రశ్నించండి. హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించామని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ కూడా ఈనాడులో వచ్చిన కథనాలే. అని ఆయన అన్నారు. మరి వీర్రాజు కోరినట్లు మీడియా చంద్రబాబును ప్రశ్నిస్తుందా?

No comments:

Post a Comment

Post Bottom Ad