అప్పట్లో ఆ విషయాలు తెలియవా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

అప్పట్లో ఆ విషయాలు తెలియవా?

ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డికి సడన్ గా విపక్ష నేత జగన్ పై ఉన్న కేసులు గుర్తుకు వచ్చాయి. వైఎస్ కుటుంబ చరిత్ర ఏమిటో, తన కుటుంబ చరిత్ర ఏమిటో తేల్చుకుందామా అని సవాల్ విసురుతూ కొండకు వెంట్రుక వేస్తున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని ను బీజేపీ దగ్గరకు రానివ్వదని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచి మంత్రిపదవి కోసం పార్టీ మారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అనైతికంగా మంత్రి పదవిలో కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డికి అప్పట్లో ఈ విషయాలు తెలియవా?

No comments:

Post a Comment

Post Bottom Ad