సినిమాలకు పొలిటికల్ ప్రమోషన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

సినిమాలకు పొలిటికల్ ప్రమోషన్!

Political promotion for movies arujun reddy, mercel

ఇటీవలి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లను చించి కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విపరీతమైన పబ్లిసిటీ కల్పించారు. సినిమాలోని సన్నివేషాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రోడ్డుపైకి వచ్చి మరీ బస్సులకు అంటించిన పోస్టర్లను చించడం, సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో తమిళనాడులో ‘మెర్సల్‌’ సినిమాలోని  జీఎస్టీ, డిజిటల్‌ ఇండియాలపై సంధించిన డైలాగులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసి ఆ చిత్రానికి పీక్ స్థాయిలో పబ్లిసిటీ కల్పించారు. దీంతో సినిమా విజయవంతం అవడంతోపాటు ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తారనే అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిసిటీ కల్పించిన నేతలే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad