రోడ్డు ప్రమాదంలో రవితేజ సోదరుడు భరత్ మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 25, 2017

రోడ్డు ప్రమాదంలో రవితేజ సోదరుడు భరత్ మృతి


Tollywood star hero Ravi Teja's brother Bhupatiraju Bharath(52) Raju succumbed to death in a road accident late Saturday night. The incident occurred when the car he was travelling in crashed into a stationary lorry

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్(52) శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తిగా దెబ్బతిన్న కారు ముందు భాగంలో భరత్ మృతదేహం చిక్కుకుపోయింది.  శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ,  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.

శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి గచ్చిబౌలికి ఒంటరిగా కారు డ్రైవ్ చేస్తూ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖానికి తీవ్రగాయాలు కావడం చేత ఆదివారం ఉదయం వరకు భరత్ను పోలీసులు గుర్తుపట్టలేకపోయారు.

పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్ గతంలోనూ పలు డ్రగ్, సెక్స్ వివాదాల్లోనూ చిక్కుకున్నాడు.

In English: Ravi Teja's brother Bharath dies in car crash

No comments:

Post a Comment

Post Bottom Ad