Video Of Day

Breaking News

గూగుల్‌కు భారీ జరిమానా

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ గూగుల్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ భారీ జ‌రిమానా విధించింది. గూగుల్ సెర్చింజన్ ఫలితాలు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఏకంగా గూగుల్‌కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17,590 కోట్లు) జ‌రిమానా విధించింది. గూగుల్ పలు సంస్థలకు అక్రమంగా ల‌బ్ధిని చేకూర్చుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈయూ సుదీర్ఘ విచార‌ణ నిర్వహిణ అనంతరం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.  గూగుల్ త‌మ సెర్చింజ‌న్‌లో చూపించిన ఆన్‌లైన్ షాపింగ్‌ స‌ర్వీస్ సంస్థల పేర్లు ఇత‌ర సంస్థలకు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని తేల్చింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో త‌న షాపింగ్ స‌ర్వీస్‌లకు ఫేవ‌ర్ చేయ‌డాన్ని నిలిపేయాల‌ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతి రోజూ ప్రపంచవ్యాస్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వ‌చ్చే ట‌ర్నోవ‌ర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామ‌ని కూడా హెచ్చరించింది.

No comments