రేపు రామేశ్వరంలో మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 29, 2015

రేపు రామేశ్వరంలో మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు

మిస్సైల్ మేన్, మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి చెందారు. షిల్లాంగ్ లోని ఐఐఎం కళాశాలలో ప్రసంగిస్తుండగా సోమవారం సాయంత్రం కింద పడిపోయారు. దీంతో హుటాహుటీన అక్కడి ఆర్మీ హాస్పిటల్ చేర్చిన భద్రతా బలగాలు.. ఆస్పత్రి సిబ్బంది శాయశక్తులా కలామ్ ను బతికించడానికి కృషి చేశారు. అయినా ఫలితం ఫలించలేదు. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఒక పేపర్ బాయ్ నుంచి రాష్ర్టపతి వరకు ఎదిగిన అబ్దుల్ కలాం సేవలను అందరూ కొనియాడారు. కలాం పార్థీవ దేహాన్ని షిల్లాంగ్ నుంచి మిలిటరీ విమానంలో ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి తరలించిన ప్రభుత్వం అక్కడ విఐపీల సందర్శనార్థం రెండు రోజులు ఉంచారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం కలామ్ స్వగ్రామమైన తమిళనాడు రాష్ర్టం
రామేశ్వరంకు ప్రత్యేక విమానంలో పార్థీవ దేహాన్ని తరలించారు. గురువారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో కలామ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు, ఇతర కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ర్టానికి చెందిన మంత్రి వర్గ బృందం అంత్యక్రియల కార్యక్రమానికి హాజరుకానుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad