మహారాష్ట్ర, హర్యానాల కొత్త సీఎంలు ఎవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 19, 2014

మహారాష్ట్ర, హర్యానాల కొత్త సీఎంలు ఎవరు?

new-chiefs-for-maharastra-haryana

మహరాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు నమోదుచేసింది. హర్యానాలో సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా మహరాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరూ సీఎం పదవిని అధిష్టంచబోతున్నారన్న అంశంపై చర్చ ప్రారంభమయింది. సాయంత్రం జరిగే భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ సందిగ్ధతకు తెరపడే అవకాశముంది.మహారాష్ట్రలో జరిగిన పంచముఖపోరులో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందన్న అంశంపై జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయి. సీఎం రేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌, సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ఖడ్సే, దివంగత నేత గోపీనాథ్‌ముండే తనయ పంకజాముండే ... తదితరులు వున్నారు.నాగ్‌పూర్‌కు చెందిన దేవేంద్ర గంగాధర ఫడ్నవిస్‌కు సచ్చీలుడనే పేరుంది. బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రస్థానమైన నాగ్‌పూర్‌ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌-ఎన్సీపీలపై విమర్శలో ఆయన ముందుండేవారు. ముంబయిపై ఉగ్రవాదుల దాడులు, ఇరిగేషన్‌ కుంభకోణం.. తదితర అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు.

వృత్తిరీత్యా న్యాయవాదైన ఫడ్నవిస్‌కు నాగ్‌పూర్‌లో మంచి విశ్లేషకుడిగా పేరుంది. ఏటా కేంద్ర బడ్జెట్‌పై ఆయన నాగ్‌పూర్‌లోని పార్కువద్ద విశ్లేషణ ఇస్తుంటారు. సామాన్యవ్యక్తిగానే టికెట్‌ తీసుకొని రైళ్లలో ప్రయాణిస్తారు. టోల్‌ప్లాజాల్లో కూడా ఎమ్మెల్యే గుర్తింపు కార్డు లేకపోతే ఇతర ప్రయాణీకుల్లాగానే టోల్‌ఫీజు కడతారు. మహారాష్ట్ర తాజా ఎన్నికల్లో కూడా అలుపెరగకుండా ప్రచారం నిర్వహించి పార్టీని విజయపథంలో నిలపడంలో కీలకపాత్ర పోషించారు.రైతు నాయకుడిగా పేరొందిన ఏక్‌నాథ్‌ఖడ్సే మృదుభాషి, ఉత్తర మహారాష్ట్రలోని జల్‌గావ్‌లోని ముక్తాయ్‌నగర్‌కు ఆయన 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1995 శివసేన-భాజపా ప్రభుత్వం ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రైతు సమస్యలపై కాంగ్రెస్‌-ఎన్సీపీలపై అలుపెరగని పోరు చేశారు.దివంగత మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్‌ముండే కుమార్తె. బీడ్‌జిల్లాలోని పార్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముండే వారసురాలిగా గుర్తింపుపొందారు. 2009లో మహారాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో ఓబీసీ నేతగా మంచిపేరుంది. తన తండ్రిని ప్రజలు మహారాష్ట్ర సీఎంగా చూడాలని కోరుకున్నారని అయితే ఆయన అకాల మరణంతో తనను సీఎంగా చూడాలనుకుంటున్నారని తన మనసులోని మాటను వెల్లడించారు.ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: హర్యానాలో భాజపా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటుచేసే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవి జాట్‌ వర్గానికి చెందిన వ్యక్తిని వరిస్తుందా.. ఇతరవర్గాలకు చెందిన వారికి దక్కుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రముఖంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామ్‌విలాస్‌ శర్మ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌, భాజపా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ దన్కర్‌, భాజపా అధికార ప్రతినిధి కెప్టెన్‌.అభిమన్యుసింధులు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. కెప్టెన్‌ అభిమన్యుసింధు ఓటమిపాలవడంతో ఆయన పేరును పార్టీ పరిశీలనలోకి తీసుకోకపోవచ్చు. అయితే భాజపా అధిష్ఠానం ఎవరికి పట్టం కడుతుందో తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో అధికంగా ఉండే జాట్‌ల వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిగా నియమించాలనుకుంటే ఓంప్రకాశ్‌ ధన్కర్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది. అయితే రాష్ట్రంలోని నాన్‌-జాట్‌, నాన్‌ జాట్‌ అర్బన్‌ ఓటర్లు కూడా భాజపా విజయంలో కీలక పాత్ర పోషించినందున , గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయానికి తెరదించేందుకు కూడా భాజపా జాట్‌ కాని వారిని ముఖ్యమంత్రిని చేయవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌ విలాస్‌ శర్మ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ధన్కర్‌, రామ్‌విలాస్‌ శర్మ, ఖట్టార్‌లతో పాటు హర్యానాకు చెందిన కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రావు ఇంద్రజిత్‌సింగ్‌లు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad