మరి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 28, 2014

మరి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు?

new-cm-tamlilanadu
జయలలితకు శిక్ష పడటంతో.. ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోనున్నారు. మరి ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా అమ్మ ఎవరిని నియమిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఒకసారి ఆమె రాజీనామా చేసినప్పుడు అమ్మ వీరవిధేయుడిగా ఉన్న పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఆయన రాష్ర్ట ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నారు. అయితే ఈయనతోపాటు రాష్ర్ట రవాణా శాఖామంత్రి సెంథిల్ బాలాజీ, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ రేసులో ఉన్నారని సమాచారం. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల రిటైరైన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే పదవీవిరమణ తర్వాత కూడా షీలాను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా జయ నియమించారు. మరోవైపు రవాణా మంత్రి బాలాజీకి.. జయలలిత దత్తపుత్రుడనే పేరుంది. 2016లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీ నడిపే బాధ్యతలను పన్నీర్ సెల్వానికి అప్పగించి, ముఖ్యమంత్రిగా బాలాజీ లేదా షీలాను ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad