అసలు జయలలిత ఎవరు? జయ జీవన ప్రస్థానం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 28, 2014

అసలు జయలలిత ఎవరు? జయ జీవన ప్రస్థానం

jayalalitha-life-history
జయరాం జయలలిత 1948లో ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మైసూర్ లో జన్మించారు. అయ్యంగార్ల కుటుంబంలో జయరాం, సంధ్య దంపతులకు రెండో సంతానంగా జన్మించిన జయలలిత తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోవడంతో తల్లి వద్ద పెరిగారు. తల్లి సంధ్య, పిన్ని విద్యావతిల ప్రభావంతో సినిమాల్లోకి ప్రవేశించారు. జయలలితకు రెండేళ్ల వయసులో తండ్రి చనిపోగా, ఇరవై ఏళ్లు వచ్చేసరికి తల్లిని కోల్పోయింది. మెట్రిక్యులేషన్ లో రాష్ర్టంలోనే మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించింది. ఆమె మొదటి నుంచీ పుస్తకాల పురుగు. మొదట కన్నడ చిత్రంలో సినిమాల్లోకి ప్రవేశించి.. ఆ తర్వాత తమిళం, తెలుగు, తదితర భాషల్లో నాయికగా ఓ వెలుగు వెలిగారు. 100కుపైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మొదటిసారి మనుషులు - మమతలు అనే చిత్రంలో ఏఎన్ఆర్ కు జోడీగా నటించింది. తర్వాత ఆస్తిపరులు, ఆమె ఎవరు?, చిక్కడు దొరకడు, నాయకుడు-వినాయకుడు, డాక్టర్ బాబు, ప్రేమలు-పెళ్లిళ్లు, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణ విజయం, ధర్మదాత, ఆలీబాబా 40 దొంగలు, గండికోట రహస్యం, కథానాయకుడు, కదలడు-వదలడు, అదృష్టవంతులు, తిక్క శంకరయ్య, అత్తగారు - కొత్తకోడలు, సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాల్లో నటించింది. తమిళుల ఆరాధ్య హీరో, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)తో సన్నిహితంగా ఉండేవారు. అన్నాడీఎంకే పార్టీ తరపున తొలిసారి 1984లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1987లో ఎంజీఆర్ చనిపోవడంతో.. జయలలిత శకం కూడా ముగిసిందని అందరూ అనుకున్నారు. ఎంజీఆర్ చనిపోవడంతో ఆయన భార్య జానకి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎంఎల్ఏగా విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో డీఎంకే గెలవడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే నిండు శాసనసభలో ఆమె చీర లాగి డీఎంకే సభ్యులు ఆమెను అల్లరి చేశారు. కరుణ హయాంలో ఎల్టీటీఈ ఉగ్రవాదం పెరుగుతుందని అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ పై ఒత్తడి తెచ్చి మళ్లీ ఎన్నికలు పెట్టేవరకు జయలలిత ఊరుకోలేదు. అలా మొదటిసారి 1991లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది జయ. 1996లో మళ్లీ కరుణానిధి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఆమె మీద అవినీతి ఆరోపణలుండటంతో ఆమె విధేయుడు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది జయ. 2002లో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఈ సమయంలోనే అర్థరాత్రి కరుణ ఇంటిమీద పోలీసుల దాడిచేసి డ్రాయర్ తో ఉన్న కరుణను ఇంటిలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. కరుణతోపాటు ఆయన మేనల్లుడు మురసోలి మారన్ ను కూడా అరెస్టు చేయించి జయ కక్ష తీర్చుకుంది. 2006లో కరుణ సీఎం అయ్యారు. 2011లో జయలలిత సీఎం పీఠం ఎక్కింది. ప్రస్తుతం 1996 నుంచీ నడుస్తున్న అవినీతి ఆరోపణల కేసులో తాజాగా అమ్మకు జైలుశిక్ష పడింది.

No comments:

Post a Comment

Post Bottom Ad