'సూపర్‌'స్టార్ రజనీకాంత్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 09, 2013

'సూపర్‌'స్టార్ రజనీకాంత్

సూపర్‌స్టార్ రజనీకాంత్ రీల్ మీద ఎంత స్టయిల్‌గా ఉన్నా, రియల్‌గా మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటారు. తనో పెద్ద సూపర్‌స్టార్ అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా చిన్నవాళ్లు చేసిన సినిమాలు నచ్చితే ఇంటికి పిలిచో, ఫోన్ ద్వారానో , బొకే పంపించో అభినందిస్తుంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులకు, సినిమాలకు రజనీ ప్రశంసలు లభించాయి. తాజాగా ఆ జాబితాలో ‘చెన్నయిల్ ఒరు నాళ్’ అనే చిత్రం చేరింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ట్రాఫిక్’కి ఇది రీమేక్.

అవయవా దానం నేపథ్యంలో శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, రాధిక, ప్రసన్న, పార్వతి మీనన్ తదితరుల కాంబినేషన్‌లో నూతన దర్శకుడు షాహిద్ ఈ సినిమా చేశారు. ‘అవయవ దానంపై చాలామందికి సరైన అవగాహన లేదు. మనం చనిపోయిన తర్వాత మన అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమందికి జీవితాన్నివ్వొచ్చు. ఆ అంశాన్ని చెబుతూ... సమాజ శ్రేయస్సు కోరి, ఒక బాధ్యతాయుతమైన చిత్రం చేసినందుకు ఈ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని రజనీకాంత్ ఓ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రశంసించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad